అంతర్జాతీయ స్ఫూర్తి సంస్థ ఆధ్వర్యంలో “డా” గుంటి పిచ్చయ్యకు ఘన సన్మానం

అంతర్జాతీయ స్ఫూర్తి సంస్థ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో గాన గాంధర్వ “కీర్తి శే” ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కళారంగా ప్రదర్శనలో మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన “డా” గుంటి పిచ్చయ్య ప్రదర్శించిన చంద్రగుప్త మహావీరుడు ఏకపాత్రాభినయం సభికులను ఆకట్టుకుంది. ప్రేమకు పరాకాష్ట నాటికను ప్రదర్శించడం జరిగింది. నాటిక అనంతరం ప్రేమకు పరాకాష్ట నాటిక కథానాయకుడు టి. కృష్ణమోహన్, కథానాయకి మనుప్రియ “డా” గుంటి పిచ్చయ్య ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి సర్వీసెస్ యంగ్ లీడర్స్ ఇండియా ఫౌండర్ చైర్మన్ డా” రమేష్ . బందరి దేవేందర్. కొడాలి మంజుల. కృష్ణ శేఖర్. శంబయ్య. పలువురు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.