అంత్యక్రియలకు ఆర్థిక సహాయం
BMR పౌండేషన్
దోమ పిబ్రవరి 7(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని దొంగ ఎంకెపల్లి గ్రామానికి అనుసంధానమైన బట్లకుంట తండా కు చెందిన ముదిరస జాన్య నాయక్ గత కొన్నిరోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ నిన్న సాయంత్రం మరణించడం జరిగింది. ఈ విషయాన్ని గ్రామస్థుల ద్వార తెలుసుకున్న ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి అందుబాటులో లేకున్నా తన అనుచరులతో అంత్యక్రియల కోసం 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లి వెంకటేష్, సాయిబాబు గోపాల్ నాయక్, రవి నాయక్, నాగయ్య , వెంకటయ్య గణేష్ తదితరులు పాల్గొన్నారు