Monday, 2 November 2026

ఘనంగా గంగమ్మ 21వ వార్షికోత్సవం

 

 

 

 

 

 

 

 

కామారెడ్డి ప్రతినిధి పిబ్రవరి6 (జనంసాక్షి)కామారెడ్డి పెద్ద చెరువు అలుగు ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో సువిశాలంగా గత 21 సంవత్సరాల క్రితం గంగామాత ఆలయాన్ని నిర్మించి గంగామాత విగ్రహాన్ని ప్రతిష్టించారు. మూడు రోజుల పాటు గంగామాత ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. 21 వ వార్షికోత్సవాన్ని ఈ సంవత్సరం కూడా మూడు రోజుల పాటు శనివారం విఘ్నేశ్వరపూజ, పూజ,మహిలతో గ్రామదేవతల భోనాలతో మ్రొక్కులు తీర్చుకున్నారు.అమ్మ వారి అభిషేకాలు,అఖండ దీపారాధన, స్వస్తి పుణ్యహావాచనము లో దంపతులు,ధ్వజస్తంభారోహన పూజలో పాల్గొన్నారు. చివరిగా 6/2/2023 సోమవారం ఉదయం 9 గం.లకు పట్టణ గంగాపుత్ర సంఘ భవనం నుండి ఉత్సవ విగ్రహాల రథయాత్ర,వలగొడుగులు,పెద్ద ఎత్తున మహిళలు బోనాల తో ప్రారంభమై భవానీ రోడ్డు , ఇస్లాంపుర , పెద్ద మసీదు, పెద్ద బజార్ , రైల్వే బ్రిడ్జి, నిజాంసాగర్ చౌరస్తా అర్ అండ్ బి గెస్ట్ హౌస్, అనంతసాయి ఫంక్షన్ హాల్ రోడ్ చెరువు మత్తడి గుండా కామారెడ్డి పెద్ద చెఱువు అలగు ప్రాంతంలో అంగరంగవైభవంగా, దేదీప్యమానంగా విద్యుత్ దీపాలతో వెలుగుతున్న చూడముచ్చటగా ముస్తాబైన ఆలయానికి చేరుకుని అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి పార్వతీ సమేత శివగంగా కళ్యాణ మహోత్సవం,సామూహిక కుంకుమార్చన, అన్నదానం, గంగాతెప్పోత్సవము మరియు గంగా మహామంగళహారతి తో 21 వ వార్షికోత్సవ ఉత్సవాలు నిర్వహించారు. పట్టణ గంగాపుత్ర సంఘం భవానీరోడ్డు కామారెడ్డి గంగాపుత్రులు తెలిపారు. భక్తులందరూ బోనాల రోజు గంభీరంగా వున్న అమ్మవారిని దర్షించుకుంటే సకలసౌభాగ్యాలు , ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని యావత్తు గంగాపుత్రుల నమ్మకం. అమ్మవారిని దర్శించుకుని అమ్మ వారి కృపకు పాత్రలు కాగలరని కోరారు. ఆదివారం మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ అమ్మగారికి పట్టువస్త్రాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.కార్యక్రమంలో గాధం లక్ష్మీ నారాయణ, ఉత్సవ కమిటీ అధ్యక్షులు కాచాపూర్ ఎల్లయ్య సహా దువ్వల నారాయణ, పాక నారాయణ, భవానీ పేట శ్యామ్ రావు‌ ,కొరుపల మహేంధర్, కొరుపల సురేష్, దువ్వల శ్రీనివాస్, దువ్వల రవికాంత్, పంపరి నవీన్, పాక వెంకటి ,పంపరి విజయ్ కుమార్,నత్తి న‌ర్సింలు , బింగి శివరాజ్ , భక్తులు గంగాపుత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.