Thursday, 5 November 2026

అందరికి ఆదర్శం ఆ మహిళా సర్పంచ్.. – పలుకు పారాబట్టి పనిలో నిమగ్నం

అందరికి ఆదర్శం ఆ మహిళా సర్పంచ్..
– పలుకు పారాబట్టి పనిలో నిమగ్నం

డోర్నకల్ డిసెంబర్ 16 జనం సాక్షి

నిత్యం సమస్యలపై అలుపెరగని పోరు,ప్రజలతో దోస్తిచేస్తూ గ్రామాభివృద్దే లక్ష్యంగా పనిచేస్తూ బొడ్రాయి తండా సర్పంచ్ తేజవత్ గమ్మి రాజు నాయక్ మహబూబాబాద్ జిల్లాలో ఆదర్శంగా నిలుస్తున్నారు.మహిళలకు స్థానిక సంస్థల్లో పదవులు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో సర్పంచ్, ఎంపిటిసిలుగా మహిళలు రాణిస్తున్నారు.మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బొడ్రాయి తండా పంచాయతీ ఎస్టీ మహిళ రిజర్వ్ కావడంతో మహిళా అయినా గమ్మి సర్పంచ్ గా పోటీచేసి గెలుపొంది గ్రామా రూపురేఖలు మార్చుతూ ముందుకుసాగుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతీ కార్యక్రమాన్ని గ్రామపంచాయితీలో అమలుపరుస్తూ నిదులను సద్వినియోగం చేసుకొని అభివృద్ధికి బాటలు వేస్తున్నారు.పాలకవర్గం సమావేశాలు, గ్రామసభలు నిర్వహిస్తూ పంచాయితీ సభ్యులు,ప్రజల అభిప్రాయాల మేరకు అభివృద్ధి పనులు చేపడుతూ, అధికారుల సహకారంతో పనులు పూర్తిచేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.పల్లెప్రగతి,హరితహారం కార్యక్రమాల్లో అన్ని తానై ప్రజల ఆరోగ్యమే ముఖ్యంగా చర్యలు తీసుకుంటున్నారు.పల్లె ప్రగతిలో భాగంగా సర్పంచ్ గమ్మి రాజు నాయక్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటు అదనపు కూలీలచే పనులను శరవేగంగా చేపట్టారు.దగ్గరుండి పనులు చేయిస్తున్నారు.రోడ్లకు ఇరువైపులా ఉన్న ముండ్లచెట్లు,గడ్డిని తొలగించి ఆస్థానంలో మొక్కలు నాటి పచ్చధనాన్ని చూపిస్తున్నారు.గ్రామంలో రోడ్లు శుభ్రం చేయడం,ఇండ్ల నుంచి ప్రజలు కుండీల్లో వేసిన చెత్తను ఎప్పటికప్పుడు ట్రాక్టర్ ద్వారా సిబ్బందితో డంపింగ్ యార్డుకు తరలింపజేస్తున్నారు.మురుగు కాలువలను శుభ్రచేయిస్తూ ప్రజలు వ్యాధులు బారిన పడకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తూన్నారు.పల్లె ప్రగతిలో చేపట్టెందుకు ప్రభుత్వం సూచించిన పనులన్నింటిని బొడ్రాయి తండలో పనులను సర్పంచ్ గమ్మి రాజు నాయక్ నాయకత్వంలో పంచాయతీ కార్యదర్శి,వార్డు సభ్యులు,ఇతర పంచాయతీకి సంబంధించిన సంఘాలన్నింటిని కలుపుకొని గ్రామభివృద్ధికి పాటుపడినారు.
హరితహారం,నర్సరీ నిర్వహణ జిల్లాలో ఎక్కడాలేనివిధంగా గ్రామం చుట్టూ రోడ్లకు రెండు వైపులా వందలాది మొక్కలను నాటి గమ్మి రాజు ఆదర్శంగా నిలుస్తున్నారు.ఏ ప్రాంతంలో మొక్కలు కిందపడిపోయిందో,కంచె లేకుండ ఉన్నాయో సిబ్బందికి అర్థమయ్యే రీతిలో ప్రత్యేక కోడ్ వేసి వాటిని కంటికి రెప్పలా సర్పంచ్ కాపాడుతున్నారు.వర్షాకాల సమయంలో వ్యాధులు ప్రభలకుండా గ్రామపంచాయతీ పక్షాన అన్ని రకాల చర్యలు తీసుకున్నారు.హరితహారం,పల్లె ప్రకృతి వనం కార్యక్రమాలను బొడ్రాయి తండాలో గ్రామస్తుల సహకారంతో యజ్ఞంలా చేపట్టారు.అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నారు. సిసి రోడ్లు,నూతన గ్రామపంచాయతీ నిర్మాణ పనులు చేపట్టి పూర్తిచేశారు.గ్రామ పరిపాలన భవనాన్ని అన్ని హంగులతో నెలకొల్పారు.రెండు పర్యాయాలు జిల్లా స్థాయి ఉత్తమ అవార్డులు అందుకున్నారు.రాష్ట్రస్థాయి అవార్డుకై విశేష కృషి చేస్తున్నారు.ప్రస్తుతం పంటల సీజన్ కావడం పనులకు మనుషులు రాకపోవడంతో తానే స్వయంగా పలుగు,పార పట్టి మన ఊరు మనబడి భవన నిర్మాణానికి కార్మికురాలుగా పనిచేస్తున్నారు.ఇటుక,సిమెంట్,రాళ్లు అందిస్తూ పనులను శరవేగంగా జరుపుతున్నారు.గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి వివిధ రకాల ఆకుకూరలు,కూరగాయల మొక్కలు నాటారు.జీవామృతం తయారీ జరుపుతున్నారు.రాష్ట్రస్థాయిలో ఆదర్శ గ్రామంగా ఎంపిక అవడం ఖాయమని అక్కడి పౌరులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.