ఘనంగా ఎమ్మెల్యే కిశోర్ కుమార్ జన్మదిన వేడుకలు
మోత్కూరు డిసెంబర్ 16 జనంసాక్షి : తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ జన్మదిన వేడుకలను శుక్రవారం మున్సిపల్ కేంద్రంలో బిఆర్ఎస్ మండల, మున్సిపల్ పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తీపి రెడ్డి సావిత్రి మేఘారెడ్డి, మండల, మున్సిపాలిటీ అధ్యక్షులు పొన్నెబోయిన రమేష్, బోడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి,వైస్ ఎంపీపీ బుశిపక లక్ష్మి,
వైస్ చైర్మన్ బొల్లపల్లి వెంకటయ్య,నాయకులు గజ్జి మల్లేష్,గానగాని నర్సింహ, దెబ్బటి శైలజ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




