Thursday, 5 November 2026

కోయగూడెం ఉపరితల గని లో పర్యటించిన మార్కెటింగ్ జీఎం

కోయగూడెం ఉపరితల గని లో పర్యటించిన మార్కెటింగ్ జీఎం

టేకులపల్లి,డిసెంబర్ 16( జనం సాక్షి ): ఇల్లందు ఏరియాలోని కోయగూడెం ఉపరితల గనిని జి.ఎం. (మార్కెటింగ్) కే. సూర్యనారాయణ గురువారం తనిఖీ చేశారు. ఈ తనిఖీ లో భాగంగా గని యొక్క ఉత్పత్తి- ఉత్పాదకత వివరాలను ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రహ్లాద్ ని అడిగి తెలుసుకున్నారు. తదుపరి పని ప్రదేశాలను సందర్శించి రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించి నాణ్యత కలిగిన బొగ్గును వినియోగదారులకు అందించాలని సూచించారు. అలాగే నాణ్యత పెంపొందించుటకు కే ఓ సి అధికారులకు తగిన సలహాలు,సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఏరియా జి.యం. ఎం. షాలెం రాజు, డీజీఎం (మార్కెటింగ్ )టి. శ్రీనివాస్, ప్రాజెక్ట్ అధికారి ఎన్విఆర్ ప్రహ్లాద్, గని మేనేజర్ సౌరబ్ సుమన్, ప్రాజెక్ట్ ఇంజనీర్ శివశంకర్, ఏరియా
క్వాలిటీ ఆఫీసర్ మహమ్మద్ యూసఫ్, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.