Thursday, 5 November 2026

అందరికీ ఓటు హక్కు కల్పించాలని కోరుతూ వైఎస్సార్ టిపి ఆధ్వర్యంలో ఆందోళన.

అందరికీ ఓటు హక్కు కల్పించాలని కోరుతూ వైఎస్సార్ టిపి ఆధ్వర్యంలో ఆందోళన.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 24 (జనం సాక్షి).సెస్ ఎన్నికల్లో సభ్యులందరికీ ఓటు హక్కు కల్పించాలని కోరుతూ వైఎస్ఆర్ టిపి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం సెస్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చోక్కాల రాము మాట్లాడుతూ సెస్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఓటర్ జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. తక్షణమే ఓటర్ జాబితాను సరిచేసి అర్హులైన అందరికీ ఓటు హక్కు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అధికారులకు వినతిపత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో పలువు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.