Thursday, 5 November 2026

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయ ఎదుట ఆందోళన.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయ ఎదుట ఆందోళన.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 23.,(జనంసాక్షి) ధరణి పోర్టల్ రద్దు చేయాలని పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ఆందోళన నిర్వహించారు. సందర్భంగా డిసిసి అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్, పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. తక్షణమే ధరణి పోర్టల్ రద్దు చేయడంతో పాటు పోడు రైతులకు హాక్కుపత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు అధికారులకు వినతి పత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు కామి ని వనిత, బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సూర దేవరాజు, మంగ కిరణ్, వెంగళ అశోక్ పలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు