బహిరంగ సభకు భారీగా తరలిన టిఆర్ఎస్ శ్రేణులు..
ఊరుకొండ, డిసెంబర్ 4 (జనంసాక్షి):
మహబూబ్ నగర్ పట్టణంలోని ఎమ్.వి.ఎస్ కాలేజ్ గ్రౌండ్ లో ఆదివారం జరిగిన బహిరంగ సభకు జడ్చర్ల ఎమ్మెల్యే, మహబూబ్ నగర్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు ఊరుకొండ మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వెళ్లారు. తరలి వెళ్లిన వారిలో మండల ప్రజా ప్రతినిధులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్ లు, వార్డ్ మెంబర్లు, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
బహిరంగ సభకు భారీగా తరలిన టిఆర్ఎస్ శ్రేణులు




