Wednesday, 4 November 2026

అందరి సహకారంతో “సెస్”అభివృద్ధి పథంలో నిలబెడతాం. సెస్ చైర్మన్ చిక్కాల రామారావు.

 

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జూన్ 8. (జనంసాక్షి). అందరి సహకారంతో సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ సెస్ ను అభివృద్ధి పథంలో నిలబెడతామని చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. గురువారం పద్మనాయక కళ్యాణ మండపంలో సహకార విద్యుత్ సంస్థ 49వ మహాసభ చైర్మన్ చిక్కాల రామారావు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమస్యల్లో ఉన్న సహకార విద్యుత్ సంస్థను తమ పాలకవర్గం లాభనవైపు తీసుకువెళ్లేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతుందని అన్నారు. పలువురు ప్రతినిధులు పలు సమస్యలను మహాసభ దృష్టికి తీసుకురాగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ పట్టుదలతో విద్యుత్ ఉత్పత్తి విషయంలో ముందంజలో ఉన్నామని అన్నారు.సభ్యుల సహకారంతో రానున్న రోజుల్లో సెస్ ను మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఎండి రామకృష్ణ వార్షిక మహాసభ కు సంబంధించిన బడ్జెట్ వివరాలు తెలియజేశారు. కార్యక్రమంలో సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, డైరెక్టర్లు దిడ్డి మాధవి, దార్నం లక్ష్మీనారాయణ, మల్లు గారి రవీందర్ రెడ్డి, నారాయణ రావు, అంజిరెడ్డి, కృష్ణ హరి, మల్లేశం శ్రీనివాసరావు ,ఆకుల గంగారం, నామాల ఉమా,హరి చరణ్ రావు, ఆకుల దేవరాజం, కొట్టేపల్లి సుధాకర్ పలువురు ప్రతినిధులు ఉద్యోగులు పాల్గొన్నారు.