Wednesday, 4 November 2026

పేదల కోసం పోరాడిన యోధుడు భగవాన్ దాస్ -ఆయన స్పూర్తితో గుడిసెవాసులందరికీ పట్టాలు

 

హన్మకొండ ప్రతినిధి జూన్ 7 జనంసాక్షిపేదల బాగు కోసం జీవితాంతం పోరాడిన యోధుడు భగవాన్ దాస్ అని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. గురువారం సీనియర్ కమ్యూనిస్టు నాయకులు బీఆర్ భగవాన్ దాస్ 93వ జయంతి వేడుకులను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమకొండ అశోక జంక్షన్ లోని భగవాన్ దాస్ విగ్రహానికి చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ
వరంగల్ నగరంలో సంఘటిత, అసంఘటిత రంగంలోని కార్మికుల హక్కుల కోసం బీఆర్ భగవాన్ దాస్ పోరాడారని అన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు కోచ్ ఫ్యాక్టరీ, ఇతర పరిశ్రమల సాధనకు, నగరానికి తాగునీటి కోసం పోరాడారని అన్నారు.
ఆనాడు భగవాన్ దాస్ స్థాపించిన గుడిసెల కాలనీలలో పేదలకు నేడు సిఎం కేసిఆర్ సహకారంతో ఇండ్ల పట్టాలు అందించి పేదల కలను సాకారం చేస్తున్నామని చెప్పారు.
పట్టాలు ఇచ్చే క్రమంలో ఎంతో మంది పేదలు భగవాన్ దాస్ ను స్మరించుకుంటున్నారని తెలిపారు.
బీఆర్ భగవాన్ దాస్ స్పూర్తితో మిగిలిన గుడిసెవాసులందరికీ త్వరలోనే పట్టాలు అందిస్తామని చెప్పారు.
ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య మాట్లాడుతూ
వరంగల్ నగర ప్రజలకు తాగు నీటి కోసం భగవాన్ దాస్ ఆనాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా అఖిల పక్షాలను కలుపుకుని వరంగల్ బంద్ కు పిలుపునిచ్చారని, దాంతో తాగు నీటి సమస్య పరిష్కారం అయిందని గుర్తు చేశారు.
పార్టీలు, సిద్దాంతాలు వేరైనా భగవాన్ దాస్ సూచించిన మార్గంలోనే నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నదని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, డాక్టర్ రాజ్ సిద్దార్థ,బీఆర్ లెనిన్,మాజీ కార్పొరేటర్ లు కానుగంటి శేఖర్, వీరగంటి రవిందర్, మిర్యాల్ కార్ దేవేందర్, రావుల కిషన్, టీయూడబ్ల్యూజేే ప్రధాన జిల్లా కార్యదర్శి తోట సుధాకర్, అయిప్పో జిల్లా ప్రధాన కార్యదర్శి నేదునూరి శ్రీహరి,సిపిఐ నాయకులు ఎన్. రాజమౌళి,కొట్టెపాక రవి, మునిగాల బిక్షపతి, మాలోతు శంకర్, కండె నర్సయ్య, రమేష్ దేవా, జితేందర్, సంజయ్, క్రిష్ణ మూర్తి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.