చేర్యాల (జనంసాక్షి) మే 30 : భారత రాజ్యాంగం ప్రకారం కుల, మత, వర్గ, విభేదం లేకుండా అందరూ సమానత్వంతో ఉండాలని చేర్యాల తహసీల్దార్ ఎస్. కె ఆరిఫా, ఎస్ఐ భాస్కర్ రెడ్డి తెలిపారు. మంగళవారం చేర్యాల మండల పరిధిలోని తాడూర్ గ్రామంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ నర్ర ప్రేమల-మహేందర్ రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా తహసీల్దార్ హాజరై మాట్లాడుతూ.. గ్రామంలో ప్రజలందరూ ఐక్యతతో శాంతియుతంగా సమానత్వంతో కలిసి ఉండాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ లక్ష్మణ్, ఎంపీటీసీ మిట్టపల్లి సులోచన-శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
అందరూ సమానత్వంతో ఉండాలి చేర్యాల తహసీల్దార్ ఆరిఫా, ఎస్ఐ భాస్కర్ రెడ్డి తాడూరులో ఘనంగా పౌర హక్కుల దినోత్సవం




