Thursday, 5 November 2026

అందుబాటులో శనగ,వరి విత్తనాలు

అందుబాటులో శనగ,వరి విత్తనాలు

తాండూరు నవంబర్ 19 జనంసాక్షి

తాండూర్ మండలంలోని రైతులకు రబీ సీజన్ గాను పంటసాగుకోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో శనగ, వరి (ఎంటియు-1010) విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారి కిరణ్మయి తెలిపారు. విత్తనాలు కావాల్సిన రైతులు తమ పట్టా పాసు పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ వెంట తీసుకురావాలని, శనగ విత్తనం 25 కిలోల సంచి రూ1580-లకు విక్రయించడం జరుగుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు