మాలధారణ స్వాములకు సద్ది పెట్టడం ఎంతో పుణ్యఫలం
హుజూర్ నగర్ నవంబర్ 18 (జనం సాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని గొట్టే రాము గురు స్వామి ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం అయ్యప్ప పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వామి నరేందర్ స్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పవిత్రమైన మాల ధారణ వేసుకున్న స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు గురు స్వాములు మాట్లాడుతూ సద్దిధానం చేయడం ఎంతో పుణ్యఫలం అని కార్తీక మాసంలో భక్తిశ్రద్ధలతో 41 రోజులు ఎంత పవిత్రంగా మాలలు వేసుకొని పూజలు చేసే అయ్యప్ప భక్తులకు ఇతర మాల ధారణ భక్తులకు అన్నదానం చేయడం ఎంతో పుణ్యఫలం అన్నారు. ఈ కార్యక్రమంలో చావసహదేవరావు, మధిర ప్రతాప్ రెడ్డి, మోహన్ రెడ్డి, దేనుమకొండ శేషంరాజు, రాతికింది రాంబాబు, పిల్లలమర్రి శ్రీనివాసు, బండి వెంకటరెడ్డి, అయ్యప్ప, శివయ్య స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మాలధారణ స్వాములకు సద్ది పెట్టడం ఎంతో పుణ్యఫలం




