తూర్పుగోదావరి: ఎడతెరపి లేకుంగా కురుస్తున్న వర్షాలతో కోనసీమలో పలు నివాస ప్రాంతాలు నీటి మునిగాయి. నిన్న రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తుని వద్ద వరద ఉద్థృతి పెరగడంతో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు నిలిపివేశారు. అన్నవరంలోని ఎస్సీకాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. కంబాలచెరువుకు వరద పోటెత్తడంతో మోకాళ్లలోతు నీళ్లలో రాజమండ్రి నగరం కూరుకుపోయింది. భారీగా వచ్చి చేరుతున్న వరదతో పంపా జలాశయంలో నీటి మట్టం ప్రమాదస్థాయికి చేరింది.




