చేర్యాల (జనంసాక్షి) ఏప్రిల్ 28 : అంధత్వ నివరణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కంటి వెలుగును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్య అధికారి రమ్య తెలిపారు. శుక్రవారం చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న కంటి వైద్య పరీక్షలను ఉద్దేశించి వారు విలేకరులతో మాట్లాడుతూ.. అందత్వ రహిత రాష్ట్రంగా నిర్మించడమే ప్రభుత్వం ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కంటి వెలుగు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసిందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. వైద్య సిబ్బందికి ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు. ఆరోగ్యమే మహాభాగ్యంగా నూరు శాతం మంది కంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో సామాజిక సేవా కర్త కత్తుల భాస్కర్ రెడ్డి, కంటి వైద్య డాక్టర్ కిషన్, ఏఎన్ఎం రిబ్బిక, వైద్య సిబ్బంది అనిల్, ఆశ వర్కర్లు, అంగన్వాడి టీచర్లు, సీఏలు తదితరులు పాల్గొన్నారు.




