Tuesday, 3 November 2026

వ్యవసాయ అధికారుల పొలం బాటపంట నష్టం వివరాలు సేకరిస్తున్న అధికారులు

 

 

 

 

 

చేర్యాల (జనంసాక్షి) ఏప్రిల్ 28 : చేర్యాల ప్రాంతంలో గత మూడు రోజుల క్రితం భారీగా కురిసిన వడగండ్ల వర్షానికి పంటలు పూర్తిగా దెబ్బతిని నేలపాలయ్యాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ యాసంగి సీజన్ లో పంటలు దెబ్బ తినడంతో రైతులు బోరున విలపిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో వడగండ్ల వర్షానికి పంటంతా నాశనమైంది. గత మూడు రోజుల కిందట కురిసిన వడగండ్లతో మండల వ్యాప్తంగా భారీగా పంటనష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు పొలాల వద్దకు వెళ్లి పంట నష్టం వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. క్షేత్రస్థాయిలో గ్రామాల వారీగా పంట నష్టం వివరాలు సేకరించి నివేదిక తయారు చేస్తున్నారు.