Tuesday, 3 November 2026

తెలంగాణ వికలాంగుల వేదిక జహీరాబాద్  మండల అధ్యక్షురాలు గా బి విజయలక్ష్మి

 

 

 

 

 

 

 

 

జహీరాబాద్ ఏప్రిల్ 28  (జనంసాక్షి:) తెలంగాణ వికలాంగుల వేదిక  జహీరాబాద్ మండల అధ్యక్షురాలు గా బారూర్ విజయలక్ష్మి ని  నియమిస్తున్నట్టు తెలంగాణ వికలాంగుల వేదిక వ్యవస్థాపకుడు మేకల సమ్మయ్య ఈమెయిల్ ద్వారా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బి విజయలక్ష్మి  మాట్లాడుతూ తెలంగాణ వికలాంగుల వేదిక జహీరాబాద్ మండల అధ్యక్షురాలు గా  నియమించినందుకు తెలంగాణ వికలాంగుల వేదిక  వ్యవస్థాపకులు మేకల సమ్మయ్య అధ్యక్షులు సుతారి రమేష్ ప్రధాన కార్యదర్శి లలిత మహిళా రాష్ట్ర, అధ్యక్షురాలు బొట్ల సుమతి  ప్రధాన కార్యదర్శి వాసీమ, సంగారెడ్డి టి వీవీ అధ్యక్షులు రాయికోటి నర్సిములు లకు ధన్యవాదాలు తెలిపారు. తనపై ఎంతో నమ్మకంతో  అధ్యక్షురాలు  గా  నియమించి నందుకు వారి నమ్మకాన్ని నిలబెడుతూ మండలం లోని వికలాంగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ప్రయోజనాన్ని ప్రతి వికలాంగునికి అందేలా చూస్తానని తెలిపారు.