గద్వాల నడిగడ్డ, 1 ఒకటి (జనం సాక్షి);వేసవిలో బలవర్ధకమైన అంబలి తాగడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడవచ్చు అని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సోమవారం పాత బస్టాండ్ లో 1983 -84 సంవత్సరానికి చెందిన ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత అంబలి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు జిల్లా కలెక్టర్ కు బొకేతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ పనుల నిమిత్తం గద్వాలకు వచ్చే ప్రజలకు అంబలి కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.అంబలి కేంద్రం ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను కలెక్టర్ అభినందించారు.ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు కరుణకుమార్, ప్రధాన కార్యదర్శి శివరతన్, కోశాధికారి రామకృష్ణ ల తో పాటు గడ్డం కృష్ణా రెడ్డి, నామల శ్రీకాంత్, శ్రీనివాసులు, జనార్దన్ గౌడ్, శ్రీవాణి, గోమతి, సుజాత, నాగరాణి తదితరులు పాల్గొన్నారు.




