మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తాలో ఔట్ సోర్సింగ్ మరియు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మెకు బిఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం.వి.గుణ ఆధ్వర్యంలో మద్దతు తెలియజేసి, పోలీసు లాగా పంచాయతీ కార్యదర్శులు కూడా 24×7 డ్యుటీ చేస్తున్నారని, ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులతో గొడ్డు చాకిరీ చేయించుకుంటూ, కాంట్రాక్టు ఉద్యోగులుగా తీసుకొని మూడేళ్ళలో రెగ్యులరైజ్ చేస్తామన్న ప్రభుత్వం హామీ నిలబెట్టుకోవాలని, ప్రభుత్వ వేధింపులు భరించలేక దాదాపు ఐదు వందల మంది పంచాయతీ కార్యదర్శులు రాజీనామా చేశారని, మొక్కలు పెరగకున్నా పంచాయతీ కార్యదర్శులదే బాధ్యత అని మానసిక వేదనకు గురి చేస్తున్నారని, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా గుర్తించి, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జి కాదాసి రవీందర్, జోనల్ మహిళా కన్వీనర్ భవానీ, మాంతయ్య, సారయ్య, వరప్రసాద్, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




