అంబానీ, ఆదాని డబ్బులతోనే గుజరాత్ లో బిజెపి గెలుపు.
* సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్.
ఖమ్మం తిరుమలాయపాలెం, (డిసెంబర్08). జనం సాక్షి.
గుజరాత్ ఎన్నికల్లో ఆదాని, అంబానీ డబ్బులు తోనే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందని. గుజరాత్ మోడల్ అభివృద్ధి ఏమీ లేదని, గుజరాత్ మోడల్‌తో దేశ ప్రజలను మోసం చేస్తున్నారని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్ అన్నారు.
స్థానిక గజ్జల వెంకటయ్య భవనంలో సిపిఎం మండల నాయకులు పద్మనాభుల సుధాకర అధ్యక్షతన జరిగిన పార్టీ మండల స్థాయి సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని బండి రమేష్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ గుజరాత్లో అభివృద్ధి ఏమీ లేదని, మతం పేరుతో రాజకీయాలు చేస్తూ మతోన్మాదంతో రాష్ట్ర ప్రజలను భయపెడుతున్నారని, మరో పక్కన అంబానీ ఆదాని డబ్బులతో ప్రజలను ప్రలోభ పెట్టి గెలుస్తున్నారని అన్నారు.
అందుకే దేశ ప్రజలు బిజెపి పాలిత రాష్ట్రాల్లో పరిస్థితులు గమనించాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు షేక్ బషీరుద్దీన్, మాట్లాడుతూ ఈనెల 29, 30 ,31 ,తారీకు లో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈనెల 29వ తారీఖున భారీ బహిరంగ సభ ఉంటుందని ఈ బహిరంగ సభకు మండలం వ్యాప్తంగా 5 వేల మందిని సమీకరిస్తున్నటువంటి చేశారు.
ఈ సమావేశంలో మండల కార్యదర్శి కొమ్ము శీను, నాయకులు ఆంగిరేకుల నరసయ్య, తుళ్లూరు నాగేశ్వరరావు, బింగి రమేష్, వసు పొంగు వీరన్న, కొంచెం స్వామి, పుష్పమ్మ, శ్రీదేవి, రావుల వెంకటరామిరెడ్డి, దిండు మంగపతి, దాసరి మహేందర్, రవి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు




