వి హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు బస్సు పాస్ మేళ

వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు నల్లగొండ డిపో వారి సౌజన్యంతో బస్సు పాస్ మేళాను నిర్వహిస్తున్నట్లు వీహెచ్పీఎస్ మండల అధ్యక్షుడు జంగాల బ్రహ్మం అన్నాడు. ఈ బస్సు పాస్ మేళాను శనివారం ఉదయం 9 గంటలకు తిరుమలగిరి గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మండలంలోని దివ్యాంగులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని, బస్సు పాస్ కోసం వచ్చేవారు సదరం సర్టిఫికెట్ పెద్దది, చిన్నది ,ఆధార్ కార్డు, పాస్ ఫోటో ఒకటి వెంట తెచ్చుకోవాలని అన్నారు . వివరాల కోసం 960 3621537 నెంబర్ ను సంప్రదించగలరు.