గుజరాత్ ఎన్నికల్లో బిజెపికి మరోసారి పట్టం కట్టిన ప్రజలు..
ధర్మపురి (జనం సాక్షి న్యూస్) భారతీయ జనతా పార్టీ నాయకులు గుజరాత్ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ అధిక మెజారిటీతో గెలవడంతో,యావత్ ప్రపంచం, అగ్ర దేశాల నాయకులు సైతం మెచ్చిన నాయకుడు నరేంద్రమోదీ అని,
గురువారం ఉదయం ధర్మపురి పట్టణ ప్రధాన కార్యదర్శి కస్తూరి శరత్ కుమార్ ఆధ్వర్యంలో,ఈ దేశం నరేంద్రమోదీ నాయకత్వంలోనే సురక్షితంగా ఉంటుందని మరోసారి నిరూపించిన ప్రజలు వరుసగా ఏడవ సారి, గెలిపించి గుజరాత్ లో అధికారంలోకి రానున్నందున యావత్ భారత్ దేశం మొత్తం కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. ధర్మపురి పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి కస్తూరి శరత్ కుమార్, ఆధ్వర్యంలో బాణసంచాలు పేల్చి అనంతరం మిఠాయి లు పంచి గెలుపు సంబరాలు చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్,కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు బండారి లక్ష్మణ్, ఓబీసీ మోర్చా ఆకుల శ్రీనివాస్, దళిత మోర్చా ఉపాధ్యక్షుడు దొనకొండ నరేష్,బీజేపీ కార్యవర్గ సభ్యుడు నరెడ్ల శంకర్,సినియర్ నాయకులు పొగుల గుండయ్య,తోట శ్రీనివాస్, కస్తూరి రాజన్న ,పానుగంటి రవి,కాశెట్టి రాజేష్, అయ్యోరి సత్యనారాయణ, బండారి గణేష్, అసం సురేష్,సంగి మాధవ్ తదితరులు పాల్గొన్నారు.




