Wednesday, 4 November 2026

అంబానీ ఆదాన్ని ఆస్తులను వెంటనే జప్తు చేయాలి

 

 

 

 

 

 

 

 

టేకులపల్లి,ఫిబ్రవరి 13( జనం సాక్షి): ప్రభుత్వ,ప్రజా ధనాన్ని ఎగవేతకు పాల్పడుతున్న అంబానీ,ఆదాని ఆస్తులను వెంటనే జప్తు చేయాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు గుగులోతు రామ్ చందర్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో టేకులపల్లి ఎస్బిఐ బ్యాంక్ ముందు సోమవారం నిరసన, ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఐ పార్టీ భద్రాద్రి జిల్లా సమితి సభ్యులు గుగులోతు రామచందర్ మాట్లాడుతూ ఆ దాని మోసాలను కేంద్ర ప్రభుత్వం వెనకేసుకొస్తుందని ఆదానిని వెంటనే అరెస్టు చేయాలని, అలానే ఆదానిచేసిన మోసాలను బహిర్గతం చేయాలని, బ్యాంకులను, ప్రభుత్వాలను మోసం చేసిన ప్రభుత్వ ధనాన్ని,ప్రజాధనాన్ని ఆదాని నుంచి రికవరీ చేయాలని,బ్యాంకుల నుండి రుణాలు పొంది కట్టకుండా ఎగవేత చేసిన బడా కంపెనీలు అన్నిటిపై తక్షణం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.వారి నుండి రికవరీ చేపట్టి బ్యాంకులను కాపాడాలని అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం రైతుగా వ్యతిరేక కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వ్యతిరేకిస్తున్నాముఅని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసి కార్పొరేటర్లకు వెన్నుదన్నుగా ఉండటాన్ని వ్యతిరేకిస్తూ పేద ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ సంస్థలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లను ప్రభుత్వ మను గడలో ఉండేలా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శి గూగులోతు శ్రీను, బానోతు వీరన్న, తేజావత్ మధు, జాటోతు సుభాష్,సతీష్,భద్రయ్య, నరేష్,నరేందర్ తదితరులు పాల్గొన్నారు.