Wednesday, 4 November 2026

ఉన్నతమైన సమాజం కోసం ప్రతిఒక్కరు సామాజిక స్పృహ కలిగి ఉండాలి

 

 

 

 

 

 

 

 

 

:సి ఐ సుధీర్ కుమార్:శామీర్ పేట్, జనం సాక్షి :-సీసీ కెమెరాల ఏర్పాటుకు 2లక్షలు విరాళం అందజేసిన క్యాతం మధుక్రిష్ణనేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదపడతాయని శామీర్ పేట సి ఐ సుధీర్ కుమార్ అన్నారు. మూడు చింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామములో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని శామీర్ పేట సి ఐ సుధీర్ కుమార్ కోరడంతో అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కీ. శే. క్యాతం కృష్ణమూర్తి కుమారుడు ఉన్నత విద్యావంతులు యువ నాయకులు క్యాతం మధుక్రిష్ణ సానుకూలంగా స్పందించి సోమవారం శామీర్ పేట పేట సి ఐ సుధీర్ కుమార్ కు రు.2లక్షలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దాత మధు క్రిష్ణ మాట్లాడుతూ… సి ఐ సూచనమేరకు సామాజిక బాధ్యతగా తను సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆర్ధిక సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం సి ఐ మాట్లాడుతూ… ప్రతిఒక్కరూ సామాజిక స్పృహ కలిగి ఉండాలని అప్పుడే ఉన్నతమైన సమాజం నిర్మితమవుతుందని సి ఐ అన్నారు. తన సూచనమేరకు సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆర్థిక సహకారం అందించినందుకు క్యాతం మధుక్రిష్ణను ఈ సందర్భంగా సి ఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ లు రవికుమార్, మునీందర్, తదితరులు పాల్గొన్నారు.