Thursday, 5 November 2026

అంబెద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మె ల్ల్యే జుక్కల్,

 జనవరి 17, (జనంసాక్షి) ,
కామారెడ్డిజిల్లా పెద్ద కొడపగల్ మండలములోని కాస్లాబాద్ గ్రామంలో మంగళవారం జుక్కల్ ఎమ్మెల్ల్యే హన్మంత్ షిండే డాక్టర్ బాబాసాహెబ్ అంబెద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమెల్ల్యే మాట్లాడుతు అంబెద్కర్ రాసిన రాజ్యాంగం పుణ్యమా అని నేను ఎమ్మె ల్ల్యే ను కాగలిగానని తెలిపారు. అట్టడుగున ఉన్న బడుగుబలహీనవర్గాలవారు ఎందరో అంబేద్కర్ రాజ్యంగం పుణ్యాన ఉన్నతోద్యోగాలు సాధించారని, చట్టసభల్లో అడుగు పెట్టారని గుర్తుచేశారు. కులం, మతం, పేద, ధనిక, ఆడ, మగ అనే తేడాలేకుండా భారతీయులం దరు సమానమే నని అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్నారని తెలిపారు. అలాంటి మహనీయుడి విగ్రహం కాస్లాబాద్ గ్రామంలో ఆవిష్కరించడం మనందరి అదృష్టమని అన్నారు. విగ్రహాన్ని ఆవిష్కరించడంతో సరిపోదని ఆ మహనీయుడి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు.ఈ కార్య క్రమంలో ఎంపిపి ప్రతాప్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్
హన్మంత్ రెడ్డి,స్ధానిక సర్పంచ్ శోభనాగభూషణం , పెద్ద కొడప్ గల్ సర్పంచ్ తిరుమల రెడ్డి, బి ఆర్ ఎస్ నాయకులు ,కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, అంబేద్కర్ అభిమానులు,ప్రజలు పాల్గొన్నారు.