విజేతలకు బహుమతులను అందజేసిన మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): ముగ్గుల పోటీలతో సూర్యాపేట మహిళల్లో చైతన్యం వెల్లివిరిసిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.జిల్లా కేంద్రంలోని 45వ వార్డులో పద్మశాలి యువజన సంఘం , జీ షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులను అందజేసి మాట్లాడారు.తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సమాజానికి మంచి సందేశాలు అందించేలా ముగ్గులు వేసిన మహిళలు అభినందనీయులని అన్నారు.మహిళలు ముగ్గులను సైనికులకు, రైతులకు ప్రోత్సాహాన్ని అందించేలా వేయడం జరిగిందన్నారు.భారతీయ సమాజంలో ఉన్న సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగలు, జాతరలు అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఏదో ఒక సందేశాన్ని ఇస్తూ మానవుడిని బాధల నుంచి విముక్తి చేయడానికి సంతోషాన్ని అందించేందుకు తోడ్పడుతున్నాయని అన్నారు.ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులను అందజేసిన కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ను అభినందించారు.రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ ముగ్గులు మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని అన్నారు.అనంతరం ముగ్గుల పోటీల్లో విజేతలైన మొదటి బహుమతి కొత్త భార్గవి, రెండో బహుమతి దేవరశేట్టి సుగుణ , మూడవ బహుమతి మొండికత్తుల వసుంధర , నాలుగవ బహుమతి యనమల్ల ప్రవల్లిక, ఐదవ బహుమతి వెంపటి మాధవి, ఆరవ బహుమతి పులి హైమావతిలతో పాటు 15 కన్సోలేషన్ బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీల నిర్వాహకులు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్,బీఆర్ఎస్ నాయకులు గండూరి ప్రకాష్ , గండూరి కృపాకర్,పద్మశాలి సంఘం జిల్లా నాయకులు అప్పం శ్రీనివాస్ రావు , మిట్టగోల యుగంధర్, పిషిక వీరయ్య , లయన్స్ క్లబ్ సభ్యులు నూకల మధుసూదన్ రెడ్డి, నూకల వెంకటరెడ్డి , మిర్యాల కృష్ణమూర్తి , కొండపల్లి లక్ష్మారెడ్డి ,రాచకొండ శ్రీనివాస్,మిట్టపల్లి రమేష్, తెరటపల్లి సతీష్, బజ్జురి శ్రీనివాస్,న్యాయ నిర్ణీతలు డాక్టర్ దుర్గాబాయి, న్యాయవాది రమాదేవి తదితరులు పాల్గొన్నారు.




