Thursday, 5 November 2026

కార్యకర్తలకు అండగా నేనుంటా

ఎమ్మెల్యే హన్మంత్ షిండే
బిచ్కుంద జనవరి 17 (జనంసాక్షి) కార్యకర్తలకు అండగా నేనుంటానని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. ఇటీవల మండల కేంద్రములో తన మిత్రుడు అన్వర్ పటేల్ మరణించడం జరిగింది. దీంతో మంగళవారం నాడు ఆయన మృతుని కుటుంబ సభ్యులకు పరామర్శించుటకై ఇంటికి వెళ్లారు. కష్ట సుఖాలలో నేనుంటానని మృతుని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఎమ్మెల్యే హన్మంత్ షిండే వెంట నాల్చర్ రాజు, నాల్చర్ బాలు, ఖలీల్ మరియు నసీర్ పటేల్ తదితరులు ఉన్నారు.