Thursday, 5 November 2026

భారతరత్న,నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్.బి ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు నిర్వహిం చి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించిన మండల కాంగ్రెస్ నాయకులు.

 

 

 

 

ఏటూరునాగారం (జనం సాక్షి),ఏప్రిల్ 14.ఈ రోజు ఏటూరునాగారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇ రసవడ్ల వెంకన్న మరియు మండల అధ్యక్షులు చిటమట రఘు ఆధ్వర్యంలో డా.బి. ఆర్.అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు నిర్వహించి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు చిటమటరఘు మాట్లాడుతూ భీంరావ్ రాంజీ అంబేడ్కర్ (డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గా కూడా పిలవబడిన) ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త.ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి.ఇతను కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి., లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి (డాక్టరేట్) పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించాడు. న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశాడు. మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పని చేశాడు. తరువాత భారతదేశ స్వాతంత్ర్యం, పత్రికల ప్రచురణ, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశాడు. 1956లో ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించడంతో దళితులు సామూహికంగా బౌద్ధంలోకి మత మార్పిడి చేసుకున్నారు.1990లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ఇతనికి మరణాంతరం ప్రకటించింది. భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన నాయకుడు. ఇతను చేసిన విశేష కృషికి ఇతని పుట్టినరోజును “అంబేడ్కర్ జయంతి” గా జరుపుకుంటారు. 2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్ లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్ లో అతను మొదటి స్థానంలో ఎంపికైయ్యాడు.కొందరివాడు కాదు అంబేద్కర్ అందరివాడు,కోట్లాది జీవితాలలో వెలుగులు నింపిన మహానుభావుడు, అంబేద్కర్ ఆశ అలా ఆచరణలతో అందరు నడవాలి, అంతటి మహానుభావుడికి నివాళులు అర్పించడం గర్వకారణం ఉంది అన్నారు,అలాగే జ్ఞానం వర్ధిల్లాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ ప్రధాన కార్యదర్శి వావిలాల నరసింహారావు, మండల ప్రధాన కార్యదర్శివావిలాల చిన్న ఎల్లయ్య,జిల్లా మైనార్టీ సీనియర్ నాయకులు ఖలీల్ ఖాన్,ఎంపీటీసీ గుడ్ల శ్రీలత -దేవేందర్,ఉపసర్పంచ్ కర్ల అరుణ,అధికార ప్రతినిధి ముక్కెర లాలయ్య,మండల మహిళా అధ్యక్షురాలుకట్కూరి రాధిక,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దొంగిరి మధుబాబు, ఎండి లాల్ మొహమ్మద్, చిన్న బోయినపల్లి సర్పంచ్ చేల వినయ్,టౌన్ ప్రెసిడెంట్ ఎండి సులేమాన్, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సరికొప్పుల శ్రీనివాస్, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి కొండ గొర్ల పోశయ్య, జిల్లా యూత్ ఉపాధ్యక్షులు సర్వ అక్షిత్, జిల్లా యూత్ కార్యదర్శి ఎండి గౌస్, మండల యూత్ అధ్యక్షులువసంత శ్రీనివాస్, పిఎసిఎస్ డైరెక్టర్ వంగపండ్ల రవి యాదవ్, టౌన్ యూత్ అధ్యక్షులు బండారు లక్కీ, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు సోదారి రామయ్య, మండల ఎస్సి సెల్ అధ్యక్షులు కర్నె సత్యం,బిసి సెల్ అధ్యక్షులు కుదురుపాక శ్రీనివాస్,సీనియర్ నాయకులు మామిడి రాంబాబు, తాళ్లపల్లి నరేందర్,వెలగందుల మాధవ్, ముమ్మునేని రమేష్,నెగరికంటి ముతేష్, సునార్కని శ్రీనివాస్, సర్దార్, ఠాగూర్, కుక్కల రాములు, చంటి, రమేష్, సుదర్శన్, ముద్రబోయిన రఘు, రవిందర్,రాజు, దుర్గం అర్జున్, పడిదాల లక్ష్మీనారాయణ,పాగ నాగరాజు, జిమిడా కళ్యాణ్, పెద్ద ఎల్లయ్య, వావిలాల లక్ష్మీనారాయణ, ఇర్సవడ్ల కిరణ్, యలం రవి, కుమ్మరి సతీష్, కొండ గొర్ల మోహన్, రమేష్, కావిరి మొండయ్య,కొండగొర్ల నరసింహులు, డోంగిరి ప్రకాష్,జాడి సత్యనారాయణ, యూత్ నాయకులు నూతి గణేష్,గాయాజ్,సద్దాం, కర్ల తరుణ్,సర్దార్, బన్నీ, అంబరిఖని వినీత్, పండగ సునీల్,బొగ్గుల సునీల్, ఖయ్యుమ్,రమేష్, సాంబ శివ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.