Thursday, 5 November 2026

అంబేద్కర్ అందరివాడు.

అంబేద్కర్ అందరివాడు.
తెలంగాణ దండోరా పార్లమెంట్ ఇంచార్జీ మంతటి గోపి మాదిగ.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, డిసెంబర్6(జనంసాక్షి):

రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ పరి నిర్వాణ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.మంగళవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ దండోరా ఆద్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా తెలంగాణ దండోరా నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జీ మంత్రి గోపి మాదిగ మాట్లాడుతూ అంబేద్కర్ పేదోడి ఇంట్లో ప్రకాశించిన సూర్యుడు అని అన్నారు. అంటారానోడి నోట అక్షరం అయి వెలుగులు నింపారని, దిక్కులేని దేశానికి దిశానిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు.అంబేడ్కర్ ఒక కులానికో,మతానికో చెందిన వారు కాదని, అంబేద్కర్ అందరి వాడని అన్నారు. స్వార్థానికి అర్థం తెలియని నిస్వార్ధపరుడని, డొక్క లెండినొడి కడుపు నింపునోడని, అలసిపోయిన జీవితాల కోసం ఆవిరైపోయి, చీకటి నిండిన జీవితాలలో వెలుగు నింపిన సూర్యుడులా దళిత గుండెల్లో చెరిగి పోనిదని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు దర్శనాల సాయికుమార్ తెలంగాణ దండోరా నాగర్ కర్నూల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు బాకీ రేణుక తాలూక నాయకులు మంతటి భూమయ్య పాదాల మధు తదితరు పాల్గొన్నారు