Thursday, 5 November 2026

అంబేద్కర్ బడుగు బలహీన వర్గల అభ్యున్నతికి ఏంతో కృషి చేసిన మహానుభావుడు

అంబేద్కర్ బడుగు బలహీన వర్గల అభ్యున్నతికి ఏంతో కృషి చేసిన మహానుభావుడు

టిఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు చుంచు నాగరాజు

ఆత్మకూర్ (ఎం) డిసెంబర్ 6 (జనంసాక్షి) మండల కేంద్రంలో తెరాస విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 66వ వర్దంతి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా తెరాస విద్యార్థి మండల అధ్యక్షులు చుంచు నాగరాజు మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గల అభ్యున్నతికి ఏంతో కృషి చేశారని కొనియాడారు భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ప్రపంచ దేశాలు కొనియాడే విధంగా రూపొందించడలో కీలక పాత్ర పోషించారు అనేక అసమానతలు వివక్షల నుండి ప్రతి భారతీయుణ్ణి విముక్తి చేయడమే లక్ష్యంగా ఆయన రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినప్పటికీ నేటికి ఈ నవ సమాజం కులం మతం అనే హీనమైన మత్తులో ఉంది దేశాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు ఎప్పుడైతే న్యాయ వ్యవస్థ పేదోడికి అందుబాటులో ఉంటుందో అప్పుడే నేరాలు తగ్గే అవకాశంఉందని కానీ అలాంటి పరిస్థితి నేడు లేదని విచారం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వి సెక్రటరీ జనరల్ గజ్జెల్లి మహేష్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నాతి మల్లికార్జున్ గౌడ్ టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బూడిద శేఖర్ గౌడ్ పట్టణ అధ్యక్షులు గడ్డం సతీష్ గౌడ్ తెరాస యువజన నాయకులు మహ్మద్ అహ్మద్ యాస మహేందర్ రెడ్డి లోడి మహేందర్ ముజహీద్ తదితరులు పాల్గొన్నారు