Thursday, 5 November 2026

మహాసభలను జయప్రదం చేయండి. బోలాగాని సత్యనారాయణ.

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం (జనంసాక్షి) న్యూస్ 06డిసెంబర్22// గీతా పనివారాల సంఘం మహాసభలను జయప్రదం చేయండి.
బోలాగాని సత్యనారాయణ.

ఈనెల 9,10వ తేదీల్లో
ఫిర్జాదిగూడా,బోడుప్పల్ బస్ డిపో వద్ద నిర్వహిస్తున్న రాష్ట్ర గీతాపనివారాల సంఘం ద్వితీయ మహాసబలను జయప్రదం చేయాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా గీత పనివారాల సంఘం గౌరవ అధ్యక్షులు బోలగాని సత్యనారాయణ తుర్కపల్లి మండల కేంద్రంలో మంగళవారం మహాసభ గోడ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హర్రజు విధానం,త్రివిధ పన్నుల రద్దు తో సహా,సహకార సంఘాల టీఎఫ్ టి లు వన పెంపకానికి 560 జీవో ఎక్స్గ్రేషియా పెన్షన్ లాంటి అనేక పథకాలను స్వాతంత్ర్య సమరయోధులు శాసన సభ పార్లమెంట్ మాజీ సభ్యుడు బొమ్మగాని ధర్మభిక్షం నాయకత్వంలో గీత పనివారాల సంఘం పోరాడి సాదించదని అన్నారు.గీత కార్మికుల కొరకు,సమస్యల పరిష్కారానికి ఏర్పాటుచేస్తున్న మహాసభలో ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు, మేధావులు,హాజరయి సందేశాలను ఇస్తారని కావున ప్రజలు,గీత వృత్తి దారులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల పార్టీ కార్యదర్శి సిలివేరు దుర్గయ్య, వలపు భగవంతు,బొట్టు భూమయ్య,నాగారం సత్తయ్య,బాలమణి తదితరులు పాల్గొన్నారు.