హుజూర్ నగర్ ఏప్రిల్ 16 (జనం సాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని తిలక్‌నగర్ అంబేద్కర్ విగ్రహ దాత తుమ్మకొమ్మ బాలరాజు రోజమ్మ, అంబేద్కర్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో చెట్టు మీద నుంచి కిందపడి పెద్ద మొత్తంలో ఆపరేషన్‌కు ఖర్చయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి కుడుతొట్టి నాగార్జున కుటుంబానికి 4000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. శనివారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షులు కోల్లపూడి యోహాన్, మామిడి ఇనియేలు, కుడితొట్టి ఇర్మియ, కోల్లపూడి ఏసురత్నం, దగ్గుపాటి బాబురావు, కోల్లపూడి కాంతయ్య, కోల్లపూడి జ్యోతి కుమారి, మామిడి కాంతమ్మ, కుడితొట్టి భాగ్యమ్మ, కోల్లపూడి శ్రీవిద్య, కుడుతొట్టి కమల, కోల్లపూడి మాణిక్యమ్మ తదితరులు పాల్గొన్నారు.




