.మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్ 16కాలనీలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు.ఆనంద్ భాగ్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బండ చెరువు చుట్టు ప్రక్కన్న ఉన్నా పది కాలని అస్సోసియేషన్ సభ్యులతో ఎమ్మెల్యే సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలని వాసులు దోమల సమస్యతో తీవ్ర ఇబ్బంది అవుతుందని గుర్రపు డెక్క తొలగించాలని బండ చెరువు డిసిల్టింగ్ చేయాలని చుట్టు ఫెన్షింగ్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులతో బండ చెరువు పరిశీలించి తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈకార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్,మీనా ఉపేందర్ రెడ్డి,మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్,సతిష్ కుమార్,పిట్ల శ్రీనివాస్,గుండా నిరంజన్,ఉపేందర్ రెడ్డి,సంతోష్ రాందాస్,సూరి,భాగ్యనంద్ రావు,బాలకృష్ణ గుప్త,పిట్ల నాగరాజు,బాలరాజు యాదవ్,చెన్నరెడ్డి,సత్యనారాయణ,మహేష్, వివిధ కాలని అస్సోసియేషన్,సభ్యులు పెంటయ్య,విజయ కుమార్,ప్రభాకర్ గౌడ్,రమేష్,యాదగిరి,జంగిర్ అలీ,ఆగమయ్య,మహేష్,నాగేష్,లక్ష్మి నారాయణ రెడ్డి,చేగురి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.




