అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి..
– ఘనంగా మినీ అసెంబ్లీ నిర్వహణ..
– పాఠశాల కరస్పాండెంట్ సామల బాలరాజు.
ఊరుకొండ, నవంబర్ 27 (జనంసాక్షి):
అడుగడుగున అవమానాలు.. అసమానతలు, కష్టాలు, కన్నీళ్లు భరిస్తూ దృఢ సంకల్పంతో ప్రపంచ మేధావిగా పేరుగాంచి.. భారతదేశాన్ని ఒకే తాటిపై నడిపిస్తున్న భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప నాయకుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని పాఠశాల చైర్మన్ సామల తిరుపతయ్య, కరస్పాండెంట్ సామల బాలరాజు లు అన్నారు. శనివారం భరత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఊరుకొండ మండల పరిధిలోని శ్రీ వేంకట బాల్ రామయ్య ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ‘మిని అసెంబ్లీ’ నిర్వహించారు. చిన్నారులు చక్కటి వేషధారణతో నాయకుల పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. మినీ అసెంబ్లీలో వివిధ నాయకుల పాత్రలు పోషించిన విద్యార్థిని విద్యార్థులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు నినదించాయి. అసెంబ్లీలో భాగంగా గౌరవ స్పీకర్ గా చందన, గౌరవ ముఖ్యమంత్రి పాత్రలో సామల ప్రణతి, ఉపముఖ్యమంత్రిగా సామల శ్రీరామ్ చరణ్, ప్రతిపక్ష నేత హోదాలో బి.జశ్వంత్ పాత్రలు పోషించారు. సభలో సామాజిక అంశాలపై చర్చ జరిగింది. విద్యార్థిని విద్యార్థులు మూడు పార్టీలుగా పాల్గొని సభను రక్తి కట్టించి చూపరులను ఆకట్టుకున్నారు. విద్యార్థులను ఉద్దేశించి పాఠశాల చైర్మన్ తిరుపతయ్య, కరస్పాండెంట్ బాల్ రాజు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ విద్యార్థులు, పౌరులు, ప్రజలు, ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం మినీ అసెంబ్లీ సమావేశంలో చక్కటి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల డైరెక్టర్ గౌరవ శ్రీ సామల గీత, పాఠశాల ప్రిన్సిపాల్ తంగచెన్ లు బహుమతులను ప్రధానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం మరియు యువకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు
అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి




