Saturday, 7 November 2026

భక్తిశ్రద్ధలతో పోతన జయంతి వేడుకలు 

భక్తిశ్రద్ధలతో పోతన జయంతి వేడుకలు

 

-వరంగల్ ఈస్ట్, నవంబర్ 27(జనం సాక్షి)

 

వరంగల్ నగరంలోని  ఏవివి కళాశాలలో ఆదివారం పోతన జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య ఎస్ ఎస్ వి ఎన్ శర్మమాట్లాడుతూ తాను చిన్నతనంలో పూర్వ విద్యార్థిగా చదివిన భాగవత పద్యాలను నరసింహ అవతార ఘట్టాన్ని చదివి అలరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉపన్యాసకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ తాడేపల్లి పతంజలి  మాట్లాడుతూ పోతన భాగవతము ఆపాల గోపాలానికి అవసరమని మనము తరించే మార్గాన్ని చూపించే చక్కటి దిక్సూచి అన్నారు. ప్రహ్లాద చరిత్ర గురించి వివరిస్తూ మానవునికి దేహవసానపర్యంతము నారాయణ చరణారవింద  సేవనమే కర్తవ్యం అని అనేక కోణాలలో వివరిస్తూ మందార మకరందం అధుర్యమున తేలు…. వంటి  పద్యములను శ్రావ్యంగా వినిపించారు . పోతన జయంతి ప్రాశస్యాన్ని వివరిస్తూ  గందె శ్రీనివాస్  ఆచార్య చందాకాంతయ్య  ఆనాటి ప్రధానోపాధ్యాయులు  వైకేశాస్త్రి  కలిసి ఈ పోతన జయంతి వేడుకలు ప్రారంభించారని ఆనాటి నుండి ప్రతి సంవత్సరము దాదాపు 2000మంది విద్యార్థుల చేత విద్యార్థుచేత భాగవత పద్యాలు చదివించి విద్యార్థులలో భక్తి భావాన్ని కలుగజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సంజీవరావు , డాక్టర్ ఎస్ సంజీవరావు , జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డాక్టర్ భూజేందర్ రెడ్డి , కళాశాల అధ్యక్షులు డాక్టర్ నాగమణి నరసింహారావు  ,కార్యదర్శి శ్రీ చందా డాక్టర్ విజయకుమార్ , శాశ్వత సభ్యులు చందా శ్రీకాంత్ , కోశాధికారి చెక్కిల మదన్మోహన్ రావు  ,పాలకవర్గ సభ్యులు గొల్లపూడి మురళీమోహన్ , ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి కోడిమాల శ్రీనివాసరావు ,పాలకవర్గ సభ్యులు, కళాశాల అధ్యాపక అధ్యాపకతర బృందం పుర ప్రముఖులు, విద్యార్థి బృందం పాల్గొన్నారు