Thursday, 5 November 2026

అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి

 

 

 

 

 

 

 

:శామీర్ పేట్, జనంసాక్షి :శుక్రవారం శామీర్ పేట లో భీం రావ్ బాబా ‌సాహెబ్ అంబేద్కర్ గారి 132 వ జయంతి సందర్భంగా దళిత నాయకులు రవిందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతు బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలు కొనసాగించి బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉండాలని, ఆవిధంగా వారి ఆశయాలను ఆచరణలో పెడితే వారికి సరైన నివాళి అర్పించినట్లు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపిపి దాసరి ఎల్లుబాయి, మండల అధ్యక్షులు విలాసాగరం సుదర్శన్ ల తో పాటు కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి,బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్,ఉప సర్పంచ్ నర్ల రమేష్ యాదవ్, మాజీ సర్పంచ్ బత్తుల కిషోర్ యాదవ్, ఎంపిటిసి డపు సాయి బాబా, ఓం ప్రకాష్,మహేందర్ యాదవ్, వైఎస్ శంకర్ గౌడ్, నాయకులు వంగ వెంకట్ రెడ్డి, ఉప్పలయ్య, శ్రీకాంత్ గౌడ్ , బి రాజు ,రఘ, నర్సింగ్ రావు, పరశురాం, మేడి రవి, మేడి భాస్కర్, బుర్క వెంకటేష్, బోయిని శివ, తాడెం కుమార్, తదితరులు పాల్గొన్నారు.