Thursday, 5 November 2026

చల్లూరు లో ఘనంగా ఎంపీపీ మూసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి వివాహ వార్షికోత్స వేడుకలుమహిళా స్వశక్తి సంఘ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు

 

 

 

 

వీణవంక ఏప్రిల్ 14( జనం సాక్షి)వీణవంక  మండలంలోని చల్లూరు గ్రామంలో మండలం ఎంపీపీ ముసిపట్ల రేణుకా తిరుపతి రెడ్డి వివాహ వార్షికోత్సవ వేడుకలు   మహిళా స్వశక్తి సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీపీ ముసిపట్ల రేణుకా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఇంతకు ముందు పరి పాలించిన  ప్రభుత్వాలు ఇన్ని విధాలుగా తెలంగాణ వచ్చిన తర్వాత బి ఆర్.ఎస్ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలో రిజర్వేషన్ కల్పించి మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రతి ఒక్కరూ రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు అండగా ఉండాలని వారన్నారు ఈ సందర్భంగా ఎంపీపీ ముసిబట్ట రేణుక తిరుపతిరెడ్డి వివాహ వార్షికోత్సవ ఘనంగా నిర్వహించి అనంతరం  కేక్ కట్  చేసి దంపతులకు శాలువతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మాజీ సింగల్ విండో అధ్యక్షుడు మాడ సాధవ రెడ్డి స్థానిక సర్పంచ్ పొదిల జ్యోతి రమేష్. ఎంపిటిసి ఎలవేని  సవిత మల్లయ్య.మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కాసం వీరారెడ్డి. వారితోపాటు ఐకెపి సిబ్బంది గను శ్యామ్. తిరుపతి. ఆనంద్ మహిళా సంఘ సభ్యులు తోపాటు తదితరులు పాల్గొన్నారు.