జుక్కల్, ఎప్రిల్ 14,( జనంసాక్షి),కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలోని మద్నూర్ మండలకేంద్రంలో గల జీపీ కార్యాలయంలో శుక్రవారం సర్పంచ్ దరావత్ సురేష్ అధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమం లో ఉపసర్పంచ్ బి.విట్టల్,వార్డుసభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.




