Thursday, 5 November 2026

ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కృషితోనే నియోజకవర్గ అభివృద్ధి – జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి

 

 

 

 

 

 

హుజూర్ నగర్ ఏప్రిల్ 13 (జనం సాక్షి): హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కృషితోనే మండలంలోని లింగగిరి నుండి వయా శ్రీనివాసపురం మీదుగా అమరవరం వరకు ఆర్ అండ్ బి రోడ్డు మరమతులకు మంజూరైన 49 లక్షల ఎమ్ఎమ్ఆర్ నిధులతో వేస్తున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను అమరవరం సర్పంచ్ గుజ్జుల సుజాతఅంజిరెడ్డి తో కలిసి జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లింగగిరి నుండి అమరవరం వరకు పిరియాడికల్ రెన్యువల్స్ లో భాగంగా 49 లక్షలు వెచ్చించి రెండు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. త్వరలో మరో కోటి 60 లక్షలతో లింగగిరి నుండి యాతవాకిళ్ళ గ్రామం వరకు రోడ్డు నిర్మాణ పనులు చెప్పడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యేగా శానంపూడి గెలిచిన తర్వాత హుజూర్ నగర్ నియోజకవర్గంలో నూతనంగా రహదారుల నిర్మాణం చేపట్టడంతో పాటు ఎన్నో సంవత్సరాలుగా గుంతలు పడి వాహనదారులకు, ప్రయాణికులకు ఇబ్బందిగా మారిన పాత రోడ్లను కూడా పిరియాడికల్ రెన్యువల్ కింద నిధులు మంజూరు చేయించి రోడ్డు వేయించడం జరుగుతుందని తెలియజేశారు. అమరవరం నుండి కొత్త తండా వరకు డబల్ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కృషి చేస్తున్నారని ఇప్పటికే ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించి అందుకు సంబంధించిన 23 కోట్లతో ఎస్టిమేషన్స్ కూడా వేయించి మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సహకారంతో, మంత్రి కేటీఆర్ , ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకుపోవడం జరిగిందని తెలియజేశారు. మఠంపల్లి మండలంలోని వివిధ తండాల నుండి పాలకీడు, గరిడేపల్లి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రానికి రావడానికి ప్రయాణం దూరం తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉస్తెల లింగారెడ్డి, గుండా బ్రహ్మారెడ్డి నాగిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, ఉపేందర్ రెడ్డి, గ్రామ కార్యదర్శి సైదులు తదితరులున్నారు.