Thursday, 5 November 2026

అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతీ ఒక్కరు ముందు ఉండాలి

అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతీ ఒక్కరు ముందు ఉండాలి.*
*కాంగ్రెస్ నాయకులు కల్వకుంట్ల సుజిత్ రావు*

మెట్పల్లి టౌన్, డిసెంబర్ 06, జనంసాక్షి
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అవార్డు గ్రహీత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ ముందుండాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ పార్కులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బాబాసాహెబ్  అంబేడ్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ మేధావిగా అంబేద్కర్ గుర్తింపు పొందారన్నారు. సమాజంలో కుల వివక్ష నశించి ప్రతి ఒక్కరూ సమానంగా ఉండేందుకు నిరంతరం కృషి చేశారన్నారు. అంబేద్కర్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు. ఆయన రచించిన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ ముందు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం కమ్యూనిటీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబోద్దిన్ పాషా, కాంగ్రెస్ నాయకులు రుత్త నారాయణ తదితరులు పాల్గొన్నారు.