ట్రాఫిక్ నియమాలపైన అవగాహన కలిగి ఉండాలి
హుజూర్ నగర్ డిసెంబర్ 6 (జనం సాక్షి): ట్రాఫిక్ నియమాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని సిఐ రామలింగారెడ్డి అన్నారు. మంగళవారం హుజూర్ నగర్ పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఆధ్వర్యంలో స్మార్ట్ లివింగ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు ట్రాఫిక్ నియమాలపై అవగాహన పొంది తల్లిదండ్రులకు, పొరుగు వారికి తెలియజేయాలని అన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే వాళ్ళు విధిగా హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని అన్నారు. రోడ్డు దాటే సమయంలో రోడ్డుపై నడిచే సమయంలో నియమాలను పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. పాఠశాల వద్ద నుండి పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఇందిరా సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకట్ రెడ్డి, ప్రిన్సిపల్ పోసాని వెంకట రమణారావు, కోఆర్డినేటర్ ఓమేష్, డీన్ ప్రేమ్‌సాగర్ , ఏవో వెంకటరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుడు అనిల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ నియమాలపైన అవగాహన కలిగి ఉండాలి




