ఘనంగా ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ జన్మదిన వేడుకలు
* అభిమానుల బైక్ ర్యాలీ
* వైద్య శిబిరం ఏర్పాటు
* కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లో పలువురు చేరిక
రేగోడ్ //జనం సాక్షి// డిసెంబర్:
మండల కేంద్రమైన రేగోడ్ లో అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ జన్మదిన వేడుకలు మంగళవారం బి ఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య ఘనంగా జన్మదిన వేడుకలు జరిగాయి,ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఎమ్మెల్యే కు శాలువాతో అభిమానులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, సన్మానించారు.
అభిమానుల బైక్ ర్యాలీ
ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా మండల పరిధిలోని ఆర్ ఇటిక్యాల,గజవాడ, దోసపల్లి, జగిర్యాల తోపాటు,వివిధ గ్రామాల నుండి బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించి రేగోడు జరిగేకార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్ ఇటిక్యాల నుండి నిర్వహించిన బైక్ ర్యాలీ కార్యక్రమంలో అభిమానులతో పాటు ఎమ్మెల్యే బైక్ ర్యాలీలో పాల్గొన్నారు, కాగా బైక్ ర్యాలీ కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఘన స్వాగతం పలికారు.
కాంగ్రెస్ పార్టీలో నుండి టిఆర్ఎస్ లో చేరిక
కాంగ్రెస్ పార్టీలో నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. రేగోడ్ కు చెందిన మాజీ వార్డ్ మెంబర్ మైబుసాబ్ తో పాటు మరికొందరు చేరగా, ప్యారారం చెందిన గుడిసె జానయ్య, గొల్ల యాదగిరి, తో పాటు ఇది గ్రామాలకు చెందిన పలువురు టిఆర్ఎస్ పార్టీలో చేరగా ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ వారికి పార్టీ కండువాను వేసి పార్టీలోకి ఆహ్వానించారు, జన్మదిన వేడుకలు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బుచ్చయ్య,పిఎసిఎస్ చైర్మన్ భాస్కరాజు, స్థానిక సర్పంచ్ బాదనపల్లి నర్సింలు, కొత్వాల్ పల్లి సర్పంచ్ రవీందర్, బురన్ వాడి సర్పంచ్ తుకారాం నాయక్,మర్పల్లి సర్పంచ్ సిద్ధారెడ్డి,ఎంపిటిసి గొల్ల నర్సింలు, పార్టీ గ్రామ అధ్యక్షుడు, రాయచోటి సుభాష్,మాజీ పిఎసిఎస్ చైర్మన్ రాధాకిషన్ గుప్తా, ఎంపీపీ మాజీ ఉపాధ్యక్షుడు,గజవాడ రాములు, మాజీ సర్పంచ్ గొల్ల కృష్ణ,,నాయకులు బాగిలి శ్రీను, హమీద్, హనుమాన్లు,నాగులపల్లివీరారెడ్డి, భూమ్ రెడ్డి, పోచారం బాలయ్య, సిందోల్ నాగయ్య స్వామి,పండల్ రెడ్డి, డబ్బుల రాజు, బాబా,తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే బర్త్‌డే సందర్భంగా వైద్య శిబిరం ఏర్పాటు
ఎమ్మెల్యే బర్త్‌డే సందర్భంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసి మందులను అందజేశారు. ఈ వైద్య శిబిరాన్ని సంగారెడ్డికి చెందిన హోప్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో కొనసాగించారు. ఈ వైద్య శిబిరంలో జనరల్ ఫిజీషియన్ డాక్టర్ శ్యాంసుందర్, మేనేజ్మెంట్ సిబ్బంది, బూత్కూర్ శ్రీనివాస్, పాండు రాథోడ్, శ్రీను చిల్డ్రన్స్ వైద్యులు తిమ్మాపూర్ దర్శన్, యాదన్నలు పాల్గొన్నారు. ఈ శిబిరంలో సుమారు 200 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. జర్నలిస్టుల ఆధ్వర్యంలో సన్మానం
అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ జనం జన్మదిన వేడుకలు సందర్భంగా రేగోడ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కు శాలువాతో సన్మానించారు. అనంతరం కేక్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు గోవింద్ రావు, సంతోష్ చారి, సుభాష్ గౌడ్, వడ్ల సంతోష్ కుమామార్,చంద్రమోహన్, షాహిద్ అలీ సంతోష్ రావు, షఫియోద్దీన్, సంగమేశ్వర్,లు పాల్గొన్నారు.
ఘనంగా ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ జన్మదిన వేడుకలు




