Friday, 6 November 2026

అంబేద్కర్ కు పూలమాల వేసి నివాళులర్పిస్తున్న గ్రామ అధ్యక్షుడు

అంబేద్కర్ కు పూలమాల వేసి నివాళులర్పిస్తున్న గ్రామ అధ్యక్షుడు
జనం సాక్షి జోగిపేట్ఆందోల్ మండలం నేరేడు గుంట గ్రామంలో రాజజంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు భారత రాజ్యాంగం రచించి 73 సంవత్సరాలు గడిచిన సందర్భంగా అంబేద్కర్ కు నివాళులు సమర్పించారు. బడుగు బలహీన వర్గాల కోసం రాజ్యాంగంలో1949 నవంబర్ 26 అంబేద్కర్ గారికి మూడు సంవత్సరాల పాటు ప్రజాస్వామ్య వ్యవస్థకు అనుగుణంగా పౌర హక్కుల కోసం అనేక చట్టాలకు రూపకల్పన చేసిన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ సగటు జీవి మనసులో చెదరని సంతకం చేశారని నేరడిగుంట యువజన సంఘాల సమితి నాయకులు మిద్దెల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో 73 వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు శివరాజ్ పూలమాలతో సత్కారించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం కార్యదర్శి బహుజన ప్రసాద్ మరియు మన్నే నర్సింలు మరియు మాజీ సర్పంచ్ దొడ్యోల్ల కిష్టయ్య మరియు యువజన సంఘాల సమితి శ్యాం మరియు గున్నాల సంతు, షాబొద్దిన్ మరియు బెగరి సుధాకర్ మరియు జిల్లా పరిషత్ పీఈటి రమేష్ గారు మరియు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మరియు గ్రామ యువజన సంఘాల నాయకులు మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు