రెండువాహనాల మధ్యలో ద్విచక్ర వాహనం ఢీ…
జనం సాక్షి భైంసారూరల్ నవంబర్26
నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్ర0 కంటి ఆసుపత్రి సమీపాన ఆర్టీసీబస్సు,పాల ట్యాంకర్ వాహనంమధ్యలోకి ద్విచక్ర వాహనం వెళ్ళి ఢీ కొంది.
ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం నడుపుతున్న షేబజ్(21)కు తీవ్ర గాయాలయ్యయి. సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో ప్రయివేటు వాహనంలోనే భైంసా ఏరియా ఆసుపత్రి కి తరలించారు.అంబులెన్స్ సమయానికి రాకపోవడంతో కుటుంబీకులు రాస్తారోకోకి దిగగా కొధ్ది మేర వరకు వాహనాలు నిలిచిపోయాయి.సంఘటన స్థలానికి ముధోల్ సి.ఐ వినోద్ , ఎస్సై తిరుపతి,స్థానిక సర్పంచ్ రాజేందర్ వచ్చి ఆందోళనకారులను సముదాయించడంతో ఆందోళన సద్దుమణిగి0ది.
షేభజ్ ఆరోగ్యపరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం బైంసా నుండి నిజామాబాద్ ఆసుపత్రికి తరలింపు చేసారు




