అంబేద్కర్ జీవితం అనేక ఉద్యమాలకు ఊపిరి పోసింది హుజూర్ నగర్ డిసెంబర్ 6 (జనం సాక్షి): అంబేద్కర్ జీవితం అనేక ఉద్యమాలకు ఊపిరి పోసిందని మహా మేధావిగా, సంఘసంస్కర్తగా రాజ్యాంగ శిల్పిగా, న్యాయ శాస్త్రవేత్తగా కీర్తి ప్రఖ్యాతులను గాంచిన అంబేద్కర్ పీడిత ప్రజల విముక్తి ప్రదాత అని హుజూర్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానోపాధ్యాయులు ఎం. బీమార్జున రెడ్డి అన్నారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా కళాశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఆ మహనీయుని ఆశలను, ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం ప్రతి భారతీయుని కర్తవ్యం అని, ప్రజాస్వామ్య పరిరక్షణలో విద్యార్థులందరూ ముందుండాలని ఆకాంక్షించారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అప్పారావు, నాగరాజు, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్తలు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
అంబేద్కర్ జీవితం అనేక ఉద్యమాలకు ఊపిరి పోసింది




