Thursday, 5 November 2026

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ముందుకెళ్లాలి.

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ముందుకెళ్లాలి.
టిఆర్ఎస్ నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు.
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 06,
జనంసాక్షి:
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచికొని భవిష్యత్తులో ముందుకెళ్లాలని టీఆర్ఎస్ నాయకులు డా.సంజయ్ అన్నారు మెట్ పల్లి పట్టణంలోని కీర్తి పంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన సాహితి మహిళ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. సీనియర్ విద్యార్ధులు జూనియర్ విద్యార్థులకు స్వాగత వేడుకల్ని ఏర్పాటు చేయగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారని అందుకు అనుగుణంగా మీరు ఎంచుకున్న లక్ష్యాల్లో సాగిపోవలన్నారు. మహిళలకు ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉంటాయని ప్రతి ఒక్క రంగంలో ముందుకు వెళ్లేందుకు ఉన్నత చదువులు చదవలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ చంద్ర ప్రకాష్, డైరెక్టర్ లు సంతోష్, నరేష్ , నాగరాజు, ఉపన్యాసకులు ప్రవీణ్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.