అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మనీయం : ఆఫ్జల్ ఖాన్
శామీర్ పేట్, జనం సాక్షి :
మంగళవారం శామీర్ పేట లో భారత రత్న భీం రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ 66 వ వర్ధంతి సందర్భంగా కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దెశానికి చేసిన సెవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. బడుగు బలహీన వర్గాల కే కాక ప్రతి ఒక్కరికి ఆయన చూపిన దిశా నిర్దేశం ఒక గీటురాయి వంటిదని, ఇటువంటి మహామనిషి మన దేశంలో పుట్టడం భారత జాతి కి గర్వకారణమని అఫ్జల్ ఖాన్ తెలిపారు. ప్రతి ఒక్కరు ఆయన ఆశయాలు పాటించి భారతావని ప్రతిష్టను మరింత గా ఇనుమడింప జేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ తో పాటు మేడ్చల్ జిల్లా కేసిఆర్ సేవాదళం కార్యదర్శి పి నర్సింహ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గొలుసుల విష్ణు, ప్రవీణ్ ,అల్లాబక్ష్, విద్యార్థులు పాల్గొన్నారు.
6ఎస్పీటీ -1: నివాళులు అర్పిస్తున్న నాయకులు
అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మనీయం : ఆఫ్జల్ ఖాన్




