Thursday, 5 November 2026

న్యూ మాంగ్స్ కుంపూ విద్యార్థులకు మంత్రి నిరంజన్ రెడ్డి

న్యూ మాంగ్స్ కుంపూ విద్యార్థులకు మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశంస.. వనపర్తి కే వన్నెతెచ్చిన విద్యార్థులను అభినందించారు *వనపర్తి టౌన్ : డిసెంబర్ 6 (జనం సాక్షి) తేదీ 05-12-22 రోజు షాద్ నగర్ లో జరిగిన నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో వనపర్తికి చెందిన న్యూ మాక్స్ కుంపూ మాస్టర్ రాఘవేంద్ర శిక్షకులు పోటీలలో పాల్గొన్న, విద్యార్థుల్లో బ్లాక్ బెల్ట్, స్పైరింగ్ గ్రాండ్ ఛాంపియన్షిప్ ని శంకర్ సాధించారు, మరియు బ్రౌన్ బెల్ట్ గ్రాండ్ ఛాంపియన్షిప్ లో కే. యశ్వంత్ గాంధీనగర్ కు చెందిన విద్యార్థి సాధించారు. మరియు బ్లాక్ బెల్ట్ కటాస్ విభాగంలో శివ గెలుపొందారు. వీరందరిని రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కరాటే విభాగంలో వనపర్తి కే వన్నెతెచ్చారని మాస్టర్ ని, విద్యార్థులని అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ గౌడ్,మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, టిఆర్ఎస్ నాయకులు తిరుమల్ ,కౌన్సిలర్లు బండారి కృష్ణ, కంచెరవి, టిఆర్ఎస్ నాయకులు డానియల్ ప్రేమానాత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.