డిసెంబర్ 9న ఇంద్రవెల్లిలో ఆదివాసీల ఆస్తిత్వ పోరు గర్జన విజయవంతం చేయాలని- తుడుందెబ్బ పిలుపు. నెరడిగొండడిసెంబర్6(జనంసాక్షి):ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో డిసెంబర్ 9న తలపెట్టిన ఆదివాసీల ఆస్తిత్వ పోరు గర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని నేరేడిగొండ మండల అధ్యక్షులు జూగ్నక్ సంబన్న అన్నారు. మంగళవారం మండలంలోని రేంగన్వాడీ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా సలహాదారు పంద్రం శంకర్ మాట్లాడుతు ఆదివాసీ హక్కుల కోసం సమస్యల పరిష్కారం కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాలలో పిసా, 1/70 చట్టాలను పకడ్బందిగా అమలు చేయాలన్నారు జీవో 3ను యధావిదంగా అమలు చేసి ఐదవ షెడ్యూల్ ప్రాతంలో ప్రభుత్వం 29 శాఖల్లో ఉన్న ఖాళీలను ఆదివాసీలతో భర్తీ చేయాలన్నారు.ఆదివాసీ గిరిజన యూనివర్శిటిని ఏర్పాటు చేయాలని స్పెషల్ డిఎస్సి వేసి ఆదివాసీ యువతి యువకులచే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ మండల కార్యదర్శి కనక గణేష్ ఇచ్చోడా మండల అధ్యక్షులు ఆత్రం మహేందర్ ఎంపిటిసి ఆత్రం భీంరావ్ మండడి కృష్ణ మాజీ వైస్ ఎంపిపి ఆత్రం లక్ష్మన్ దుర్వ రాజు మాజీ సర్పంచ్ కోటేష్ ఉప సర్పంచ్ పూసం విట్టల్ గ్రామ పటేల్ ఆడేం సంతోష్ ప్రజలు పాల్గొన్నారు.
డిసెంబర్ 9న ఇంద్రవెల్లిలో ఆదివాసీల ఆస్తిత్వ పోరు




